Header Banner

ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని మంత్రి! అనంతపురం జిల్లా గుత్తిలో 64వ రోజు ప్రజాదర్బార్!

  Fri May 16, 2025 12:23        Politics

అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్.. తన రెండో రోజు పర్యటనలో గుత్తి సమీపంలోని రామరాజుపల్లెలో ఉదయం 64వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసేందుకు ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. ప్రతి ఒక్కరిని స్వయంగా కలిసిన మంత్రి నారా లోకేష్... వారిని ఆప్యాయంగా పలకరించి వినతులు స్వీకరించారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కారం కోసం తగిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నిన్న గురువారం గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమన్వయం సమావేశం అనంతరం మంత్రి నారా లోకేష్ 63వ ప్రజాదర్బార్ నిర్వహించారు. పెద్దఎత్తున తరలివచ్చిన సామాన్య ప్రజానీకం, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు.

 

15వ ఆర్థిక సంఘం నిధులు కాజేశారు, చర్యలు తీసుకోండి..

వంశపారపర్యంగా తమకు సంక్రమించిన భూములను కబ్జాదారుల నుంచి కాపాడాలని గుత్తి పట్టణానికి చెందిన మంగల రంగనాయకులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. కరిడికొండ రెవెన్యు గ్రామంలో తమ కుటుంబానికి 6.50 ఎకరాల భూమి ఉంది. అయితే బేతాపల్లికి చెందిన కిష్టన్న అనే వ్యక్తి నకిలీపత్రాలు సృష్టించి అధికారులతో కలిసి మా భూమిని ఆక్రమించారు. విచారించి తగిన న్యాయం చేయాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

అనంతపురం జిల్లా పామిడి మండలం సాలూరులో తమ పట్టా భూమి 1.24 ఎకరాలను ఆన్ లైన్ చేయాలని గ్రామానికి చెందిన పి.నారాయణ మంత్రి నారా లోకేష్ ను కలిసి విన్నవించారు. తమ తండ్రిని నుంచి సంక్రమించిన వ్యవసాయ భూమికి పాస్ పుస్తకం కోసం అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

తమ ఊరి పొలాలకు వెళ్లేందుకు ఉపాధి హామీ పథకం కింద మట్టి రోడ్డు నిర్మించాలని పామిడి మండలం సాలూరు గ్రామానికి చెందిన ఎన్.కృష్ణ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

 

ఇది కూడా చదవండి: శ్రీధర్ రెడ్డి వైద్య పరీక్షలు పూర్తి.. సిట్ కస్టడీకి తరలింపు! ఈ కేసులో ఏ31, ఏ32గా..

 

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నెలకొండ గ్రామ వైసీపీ సర్పంచ్ భర్త జయరామిరెడ్డి.. గ్రామానికి మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.16 లక్షలను ఎలాంటి పనులు చేయకుండానే స్వాహా చేశారని, విచారించి తగిన చర్యలు తీసుకోవాలని సింగాడి శ్రీనివాసులు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఫిర్యాదు చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం నెలకొండలో 2016-18 మధ్య కాలంలో 30 మందికి ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద పూర్తైన ఇళ్లకు ఇప్పటివరకు బిల్లులు మంజూరుకాలేదని జి.శ్రీనివాసులు మంత్రి నారా లోకేష్ ను కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ సానుభూతిపరులనే నెపంతో గత వైసీపీ ప్రభుత్వం బిల్లులు నిలిపివేసిందని మంత్రి దృష్టికి తీసుకువ్చచారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

గత వైసీపీ ప్రభుత్వంలో సర్పంచ్ గా పోటీచేసిన తనపై అక్రమ కేసు నమోదు చేసి వేధింపులు గురిచేశారని, తనపై నమోదు చేసిన కేసును ఎత్తివేయాలని అనంతపురం జిల్లా పామిడి మండలం సాలూరుకు చెందిన ఎస్.దేవేంద్రరెడ్డి మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేయాలని అనంతపురానికి చెందిన ఎస్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

 

ఇది కూడా చదవండి: ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

అనంతపురం జిల్లా పామిడి మండలం తంబళ్లిపల్లిలోని పుల్లేటి వాగు వల్ల వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని, శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో పుల్లేటి వాగుపై మండల కేంద్రానికి వెళ్లే దారి నరకప్రాయంగా మారుతోందని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రతతో పాటు నెలవారీ వేతనాలు చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం ఏరూరులో డ్రైనేజీ వ్యవస్థను నిర్మించాలని కోనంకి మహేష్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ గ్రామ, వార్డు సచివాలయం ఎంప్లాయిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. పెండింగ్ డీఏలను చెల్లించడంతో పాటు నోషనల్ ఇంక్రిమెంట్స్ పై నిర్ణయం తీసుకోవాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవులపై జోరుగా చర్చలు.. మరో జాబితా లిస్ట్ రెడీ! చంద్రబాబు కీలక సూచన - వారిపై ఎక్కువ దృష్టి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడ, విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting